కామారెడ్డిలో ఎస్సీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని కోరుతూ అంబేద్కర్ యువజన సంఘం నేతలు ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్యకు వినతిపత్రం ఇచ్చారు. ఆర్థిక ఇబ్బందులు పడుతున్న కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ ప్రాంతాల ఎస్సీ విద్యార్థుల కోసం ఉచిత శిక్షణ, వసతి కల్పించాలని వారు విజ్ఞప్తి చేశారు.