KMM: రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తిగా సేకరిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కూసుమంచి మండలం చేగొమ్మలో గోదాం ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కొనుగోలు చేసిన ధాన్యానికి వారం రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసే విధానం కొనసాగుతున్నదని చెప్పారు. రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.