NDL: జిల్లాలో పలు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి సుమారు రూ.15 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ సునీల్ షోరాణ్ తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడు పలు కేసుల్లో పాల్గొన్నట్లు శుక్రవారం గుర్తించారు. పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.