TG: రాష్ట్రంలో పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామని CM రేవంత్ రెడ్డి వెల్లడించారు. ‘నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తాం. అలాగే విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్, భోజనం ఇస్తాం. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు రవాణా సౌకర్యం కల్పిస్తాము. 2034లో జరిగే ఒలింపిక్స్లో తెలంగాణ నుంచి గోల్డ్ మెడల్స్ తీసుకు రావడమే మా లక్ష్యం’ అని పేర్కొన్నారు.