ప్రకాశం: కంభం పట్టణంలోని 132/33 కేవీ సబ్ స్టేషన్లో మరమ్మతుల కారణంగా శనివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని విద్యుత్ శాఖ ఏడి శ్రీనివాస్ తెలిపారు. స్థానిక కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. శనివారం ఉదయం 6:30 నుంచి 11:30 వరకు సబ్ స్టేషన్లోని అన్ని ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిపి వేస్తున్నట్లు తెలిపారు. విద్యుత్ వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.