హీరోయిన్ రష్మిక అంతర్జాతీయ స్థాయిలో మరో అరుదైన అవకాశాన్ని దక్కించుకుంది. టోక్యోలో జరగనున్న ‘2026 క్రంచీరోల్ యానిమే అవార్డ్స్’ ప్రదానోత్సవంలో ఆమె ప్రెజెంటర్గా పాల్గొనబోతోంది. 2024లోనూ ఆమె తొలిసారిగా ఈ వేడుకకు హాజరైంది. ఇప్పుడు రెండోసారి కూడా ఈ ప్రతిష్టాత్మక ఆహ్వానాన్ని అందుకోవడం ద్వారా, ఈ గౌరవాన్ని దక్కించుకున్న తొలి సెలబ్రిటీగా రష్మిక కొత్త రికార్డు సృష్టించింది.