CSKతో జరిగిన మ్యాచ్లో PBKS 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 210 పరుగుల భారీ లక్ష్యాన్ని పంజాబ్ 18.4 ఓవర్లలోనే ఛేదించింది. పంజాబ్ బ్యాటర్లు శ్రేయస్ అయ్యర్(50) హాఫ్ సెంచరీతో అదరగొట్టగా.. ప్రభసిమ్రన్(43), ప్రియాన్స్ ఆర్య(39), కానొలీ(36) పరుగులతో రాణించారు. CSK బౌలర్లు హెన్రీ, అన్షుల్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. భారీ స్కోర్ చేసినా.. CSK ఓటమి అభిమానులను నిరాశపరిచింది.