SRH ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి KKRపై అదిరిపోయే ప్రదర్శనతో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. 39 పరుగులు చేయడంతో పాటు 2 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే తన బౌలింగ్ మెరుగుపడటానికి ‘ప్రత్యేక వ్యక్తి’ ఉన్నారని, ఆ శిక్షణే ఈ మార్పుకు కారణమని తెలిపాడు. ఆ వ్యక్తి ఎవరనేది ప్రస్తుతానికి సస్పెన్స్ అని, త్వరలోనే వెల్లడిస్తానని చెప్పుకొచ్చాడు.