AP: SPDCLలో ఐటీఐ నకిలీ విద్యార్హత పత్రాలతో కొలువులు పొందిన 69 మంది షిఫ్ట్ ఆపరేటర్లపై అధికారులు వేటు వేశారు. విచారణలో వీరి సర్టిఫికెట్లు దొంగవని తేలడంతో తక్షణమే విధుల్లోంచి తొలగించారు. ఇందులో అత్యధికంగా కడప జిల్లాకు చెందిన 38 మంది ఉండగా.. కర్నూలు, చిత్తూరు సహా పలు జిల్లాల వారు ఉన్నారు. ఇకపై నియామకాల్లో సర్టిఫికెట్లను క్షుణ్ణంగా పరిశీలించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.