VZM: ఈ నెల 12న ప్రపంచ శాంతి కోసం బొబ్బిలిలో సెమినార్ నిర్వహిస్తున్నట్లు గురజాడ అద్యాయన వేదిక కన్వీనర్ విజయ గౌరీ తెలిపారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ.. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దేశాల సామ్రాజ్యవాద దాడులను నిరసిస్తూ, యుద్ధం ఆగి ప్రపంచశాంతి కలగాలని కోరుతూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ప్రముఖ సామాజిక విశ్లేషకులు రాంభూపాల్ వక్తగా హాజరవుతారన్నారు.