SDPT: ప్రజలు నాణ్యమైన ఉత్పత్తులు వాడి ఆరోగ్యంగా ఉండాలని ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఆయిల్ రీసెర్చ్ డైరెక్టర్ డా.మాథుర్ సూచించారు. శుక్రవారం సిద్దిపేటలో ఏర్పాటు చేసిన కోల్డ్ ప్రెస్ సంస్థను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఫుడ్స్ విక్రయించే ప్రతి సంస్థ నాణ్యత వద్ద కాంప్రమైజ్ కావద్దన్నారు. ప్రజలు నాణ్యమైన ఆహార పదార్థాలను వాడి ఆరోగ్యంగా ఉండాలన్నారు.