WNP: ఉరివేసుకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం వనపర్తి మండలంలో చోటుచేసుకుంది.పోలీసుల వివరాలు.. సవాయిగూడెం గ్రామానికి చెందిన గంధం మహేశ్(23)కు మానసిక స్థితి సరిగ్గా లేదు. దీంతో జీవితంపై విరక్తి చెంది శుక్రవారం మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో తన ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరివేసుకొని చనిపోయాడు.మృతుడి అన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై హృషికేశ్ తెలిపారు.