ఇటీవల MBBS పట్టా అందుకున్న నటి శ్రీలీల, అటు వైద్యం ఇటు సినిమా రెండు భిన్న ప్రపంచాలను బ్యాలెన్స్ చేస్తోంది. వైద్యం తనను వాస్తవికతకు దగ్గరగా ఉంచితే, సినిమా తన పరిధిని విస్తరిస్తుందని ఆమె పేర్కొంది. ‘ఈ రెండు రంగాలూ నా జీవితాన్ని ఫుల్‌ఫిల్ చేస్తాయి. భాషతో సంబంధం లేకుండా మంచి కథలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు, అందుకే బాధ్యతాయుతమైన పాత్రలు చేయాలి’ అని శ్రీలీల భావిస్తోందట.