MBNR: జిల్లా పోలీసు కార్యాలయం మైదానంలో నిర్వహించిన కవాతును ఎస్పీ డి.జానకి పరిశీలించారు. వివిధ విభాగాల పోలీసులు పాల్గొనగా, ఉద్యమాలు, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలపై మాక్ డ్రిల్ నిర్వహించారు. అనంతరం సిబ్బందితో సమావేశమైన ఎస్పీ, ఆరోగ్యంపై దృష్టి పెట్టడం ద్వారా ప్రశాంత జీవనం సాధ్యమని సూచించారు.