TG: క్యాతనపల్లి, ఇబ్రహీంపట్నం పీఠాలు BRS కైవసం కావడం పట్ల KTR హర్షం వ్యక్తం చేశారు. అధికార కాంగ్రెస్ ఎన్ని అరాచకాలు చేసినా ఆ స్థానాలను దక్కించుకున్నామని.. అణచివేత, అప్రజాస్వామిక చర్యలకు రాష్ట్రంలో తావులేదన్నారు. కాంగ్రెస్‌కు ప్రజాక్షేత్రంలో కౌంట్‌డౌన్ మొదలైందని అన్నారు. మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్లుగా ఎన్నికైన వారికి శుభాకాంక్షలు తెలిపారు.