AP: ఆలయ కమిటీల్లో SCలను వేయాలని చూస్తే ఎక్కడా దొరకలేదని డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణ అన్నారు. ‘మతం మారని ఎస్సీలే లేని పరిస్థితి. అంబేద్కర్ పేరుతో కొందరు ఆందోళనలు చేస్తున్నారు. అంబేద్కర్ క్రిస్టియానిటీని వ్యతిరేకించి.. బౌద్ధమతం స్వీకరించారు. మతం మారిన ఎస్సీల వల్ల మారని వాళ్లు నష్టపోతున్నారు. భక్తుడిగా నాకు అవమానం జరిగింది. అందుకే ఈ అంశంపై పోరాడుతున్నాను’ అని చెప్పారు.