AP: మాజీ సీఎం జగన్ కొత్త రాజధాని ప్రతిపాదన చూసి ప్రజల నవ్వుకుంటున్నారని మంత్రి పార్థసారథి ఎద్దేవా చేశారు. సొంత పార్టీ నాయకులే ఆయన ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. 34వేల ఎకరాలు ఇచ్చిన రైతుల త్యాగాన్నిజగన్ అవమానించారని మండిపడ్డారు. ప్రజాస్వామ్య సాక్షిగా వైసీపీకి ప్రజలే చరమగీతం పాడుతారని చెప్పారు. రాష్ట్రానికి అమరావతి ఎకనమిక్ గ్రోత్ ఇంజిన్‌గా మారుతుందన్నారు.