SDPT: బెజ్జంకి మండల కేంద్రంలో డా. బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల ప్రజా సంఘాల సమన్వయంతో ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సానగొండ శరత్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ముఖ్య అతిథిగా సర్పంచ్ బొల్లం శ్రీధర్ పాల్గొని ఆయన సేవలు, త్యాగాలను స్మరించారు.