AP: YCP నేత అయోధ్యరామిరెడ్డిని కలిసినట్లు వస్తున్న వార్తలను MP ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. తాము కూటమి ప్రభుత్వంలో గౌరవంగా ఉన్నామని, ఎట్టి పరిస్థితుల్లోనూ TDPని వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రాజధాని విషయంలో YCPకి అవగాహన లేదని ఎద్దేవా చేసిన ఆయన, మత్స్యకారులకు జగన్ పార్టీ మొదటి నుంచీ ద్రోహం చేస్తోందని విమర్శించారు.