KMM: కల్లూరు మున్సిపాలిటీ పరిధిలోని NSP కెనాల్లో పడి కిరాణా వ్యాపారి తొర్రికొండ వెంకటేశ్వరరావు మృతి చెందారు. రఘునాథపాలెం నుంచి కల్లూరు వస్తుండగా ప్రమాదవశాత్తు కాలువలో పడి కొట్టుకుపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సోమవారం ఉదయం కాలువలో మృతదేహం లభ్యమవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.