‘ధురంధర్ 2’ చిత్రం మరో వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాలో ‘హమ్ ప్యార్ కర్నే వాలే’ పాటను అనుమతి లేకుండా వాడారంటూ త్రిమూర్తి ఫిల్మ్స్ బాంబే హైకోర్టులో పిటిషన్ వేసింది. ఇప్పటికే ఓ రచయిత తన కథను కాపీ కొట్టారని కోర్టును ఆశ్రయించగా, తాజాగా సాంగ్ కాపీరైట్ వివాదం తోడైంది. ప్రస్తుతం ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.1,600 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకుపోతోంది.