MHBD: గూడూరు మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. భోజనం చేస్తున్న సమయంలో గొంతులో అన్నం ఇరుక్కుని వ్యక్తి మృతి చెందాడు. బుధవారం రాత్రి పిల్లిగుండ్లతండాకు చెందిన బానోతు బిచ్చా (54) దుర్గమ్మ పండగ సందర్భంగా భోజనం చేస్తుండగా ఈ ఘటన జరిగింది. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.