BDK: జూలూరుపాడు మండల పరిధిలోని పడమట నర్సాపురం వద్ద నిన్న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారని స్థానికులు తెలిపారు. బేతాళపాడు గ్రామానికి వెళ్లే మార్గంలో ఆటో, ద్విచక్ర వాహనం ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.