KMM: జిల్లాలో జనగణన-2027 ప్రక్రియను పకడ్బందీగా, ఖచ్చితత్వంతో పూర్తి చేయాలని కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. నిన్న కలెక్టరేట్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. హౌస్ లిస్టింగ్ బ్లాక్‌లను గుర్తించి వెంటనే పోర్టల్‌లో నమోదు చేయాలన్నారు. ప్రతి బ్లాక్‌కు భౌతిక తనిఖీలు నిర్వహించాలని సూచించారు. ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని అన్నారు.