TG: వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ(KMC)లో ర్యాగింగ్ కలకలం రేగింది. జూనియర్లను మోకాళ్లపై కూర్చోబెట్టి వేధించిన ఏడుగురు MBBS విద్యార్థులపై ప్రిన్సిపాల్ సంధ్యారాణి వేటు వేశారు. వారిని ఏడాది పాటు కాలేజీ నుంచి సస్పెండ్ చేయడమే కాకుండా, హాస్టల్ నుంచి శాశ్వతంగా బహిష్కరించారు. జూనియర్ల ఫిర్యాదుతో విచారణ చేపట్టిన యాజమాన్యం, ర్యాగింగ్ నిజమని తేలడంతో ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.