ADB: భారతీయ రైల్వే ద్వారా డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించే లక్ష్యంతో ఆదిలాబాద్ రైల్వే స్టేషన్లో కేంద్రీయ విద్యాలయం విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రచారంలో భాగంగా, కౌంటర్ టిక్కెట్లు తీసుకునేటప్పుడు డిజిటల్ చెల్లింపు (క్యూర్ కోడ్) ఉపయోగించడానికి ప్రయాణికులను ప్రోత్సహించారు. డిజిటల్ చెల్లింపు ప్రక్రియను విద్యార్థులకు వివరించారు.