SDPT: సిద్దిపేట నుంచి కేదార్నాథ్ వెళ్లే భక్తుల కోసం దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద ఉచిత లంగర్ ఏర్పాటు చేస్తున్నట్లు సేవా సంస్థ అధ్యక్షుడు చీకోటి మధుసూదన్ తెలిపారు. ఈ నెల 22న కేదార్నాథ్ యాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో, భక్తులకు భోజన వసతులు కల్పించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, నిత్యవసర సరుకులతో కూడిన వాహనాలు ఈ నెల 14న సిద్దిపేట నుంచి బయలుదేరనున్నాయి.