SRD: సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని పోతిరెడ్డిపల్లి జాతీయ రహదారిపై నెలలుగా మురుగునీరు పారుతోందని స్థానికులు తెలిపారు. దీంతో దుర్గంధం వ్యాపించి వాహనదారులు, బాటసారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే చర్యలు తీసుకుని సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.