ADB: జిల్లాలో కారుణ్య నియామకాల కింద వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు ఎంపికైన 16 మంది అభ్యర్థులకు ఉత్తర్వులను కలెక్టర్ రాజర్షిషా శనివారం అందజేశారు. విధి నిర్వహణలో ఉండి మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నియామకాలు చేపట్టిందన్నారు. కలెక్టరేట్ AO వర్ణ, సీనియర్ అసిస్టెంట్ ప్రసాద్, అధికారులు తదితరులున్నారు.