NGKL:డీఎస్ఐ కాలువ వల్ల మహబూబ్‌నగర్ రైతులు భూములు కోల్పోతుండగా, నీళ్లు నల్గొండకు మళ్లుతున్నాయని పాలమూరు అధ్యయన వేదిక నేతలు విమర్శించారు. పోతారెడ్డిపల్లి, ఉల్పర గ్రామాల్లో బాధిత రైతులతో భేటీ అయ్యారు. జిల్లాకు నష్టం కలిగించేలా ఉన్న కాలువ డిజైన్‌ను వెంటనే మార్చాలని రాఘవాచారి, సదానంద గౌడ్ డిమాండ్ చేశారు. రైతుల ప్రయోజనాలను కాపాడాలని కోరారు.