SRPT: నిరుపేదల ఆరోగ్యానికి సీఎంఆర్ఎఫ్ ద్వారా ప్రభుత్వం భరోసా కల్పిస్తుందని ఏఐసీసీ సభ్యుడు సర్వోత్తమ్ రెడ్డి అన్నారు. శనివారం చివ్వెంల మండలం బండమీద చందుపట్లకి చెందిన స్వాతికి మంజూరైన రూ. 28 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును పంపిణీ చేసి మాట్లాడారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పరిమితిని రూ. 10 లక్షలకు పెంచిందన్నారు.