PDPL: గోదావరిఖనిలోని ఐఎన్టీయూ కార్యాలయంలో బుధవారం అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య పెద్దపల్లి జిల్లా 8వ మహాసభ నిర్వహించారు. రాష్ట్ర నాయకుడు రాజన్న పతాకావిష్కరణ చేయగా, ప్రధాన కార్యదర్శి అబేద్నెగో అమరవీరులకు నివాళులర్పించారు. సామ్రాజ్యవాద విష సంస్కృతిపై ఆటపాటలతో ప్రజలను చైతన్య పరచడమే లక్ష్యమని నేతలు పేర్కొన్నారు. అమరుల పోరాట స్ఫూర్తితో ఉద్య మించాలన్నారు.