E.G: పార్లమెంటులో నారీ శక్తి అభియాన్ బిల్లుపై రంగంపేటలో రూపొందించిన సైకత శిల్పం విశేషంగా ఆకట్టుకుంటోంది. దేవీన శ్రీనివాస్ కుమార్తెలు సోహిత, ధన్యత పది గంటల పాటు శ్రమించి దీనిని తీర్చిదిద్దారు. ‘ఇల్లు, పిల్లలే కాదు.. దేశాన్ని కూడా చక్కదిద్దుతాం’ అనే నినాదంతో భారతదేశ చిత్రపటం, పిడికిలి బిగించిన మహిళ ప్రతిమను రూపొందించారు.