SRPT: నాగారం మండలం పసునూరు మోడల్ స్కూల్లో ఈనెల 19న ప్రవేశ పరీక్ష జరుగుతుందని పాఠశాల ప్రిన్సిపాల్ చంద్రబాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి వరకు పరీక్షలు ఒకే రోజు జరుగుతాయని పేర్కొన్నారు. 6వ తరగతికి ఉ 10 నుంచి మ 12 గం. వరకు, 7నుంచి 10వ తరగతి వరకు మ 2గం. నుంచి సా. 4గంటల వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు.