KRNL: అందరి సహకారంతోనే నగరాభివృద్ధికి కృషి చేశానని కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ విశ్వనాథ్ అన్నారు. శుక్రవారం కర్నూలులోని కేఎంసీ క్యాంపు కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. తాను పనిచేసిన కాలంలో నగరాభివృద్ధిలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టామన్నారు. నిబంధనల మేరుకు తనను బదిలీ చేశారని, బదిలీపై కొంతమంది అపోహలను సృష్టిస్తున్నారని ఆయన వెల్లడించారు.