KKD: మహిళా సంఘాల ఆర్థికాభివృద్ధితో పాటు వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కాకినాడ కలెక్టర్ హరిందర ప్రసాద్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో డ్వాక్రా, మెప్మా, సెర్ప్ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని 38,528 మహిళా సంఘాల పనితీరు, మంజూరు చేస్తున్న రుణాలు, రికవరీ తదితర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.