JBL: టేకుమట్ల మండలంలో గంజాయి మొక్కలు పెంచుతూ, రవాణా చేస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ మల్లేష్ శుక్రవారం తెలిపారు. మండలంలోని ఉదయ్ కుమార్, వావిలాల గ్రామానికి చెందిన రాహుల్‌ను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.