ములుగు జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే ప్రజా దర్బార్ నుప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ దివాకర టీఎస్ కోరారు. ఇవాళ రాయినిగూడెం, సర్వాపురం గ్రామాల్లో మంత్రి సీతక్క ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రజలు తమ ఫిర్యాదులు, పథకాల అర్జీలను సమర్పించాలని సూచించారు. సమస్యల తక్షణ పరిష్కారానికి అధికారులు అందుబాటులో ఉంటారు.