AP: రెండో విడత భూసమీకరణపై CM చంద్రబాబు రాత్రి భేటీ అయ్యారు. అర్ధరాత్రి వరకు సాగిన ఈ భేటీలో తాడికొండ, పెదకూరపాడు నియోజకవర్గాలకు చెందిన 10 గ్రామాల రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎకరానికి రూ.40 వేల చొప్పున పదేళ్లపాటు కౌలు, కుటుంబానికి రూ.1.5 లక్షల రైతు రుణమాఫీ చెల్లించేందుకు CM ఆంగీకరించారు. ఏటా రూ.3 వేల చొప్పున కౌలు పెంచేందుకు ఒప్పుకున్నారు.