మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చిత్రపటానికి కార్యకర్తలు పాలాభిషేకం చేశారు. జిల్లా అధ్యక్షుడు మున్నూరు జైపాల్ మాట్లాడుతూ.. మల్లన్న పోరాట ఫలితంగానే కుల గణన రిపోర్టు వెలువడిందని, దీనివల్ల అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు మహమ్మద్ అలీ, బుగ్గన్న, చందు ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.