BHPL: రేగొండ మండలం దమ్మన్నపేట గ్రామంలో అక్రమంగా గుడుంబా తయారు చేస్తున్నారనే పక్కా సమాచారం మేరకు రేగొండ పోలీసులు స్థావరంపై మెరుపు దాడులు చేపట్టారు. ఈ దాడుల్లో ఐలు శ్రీనివాస్ నివాసంలో సుమారు 4 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకున్నారు. గుడుంబాను నిబంధనల ప్రకారం సీజ్ చేసి, నిందితుడు శ్రీనివాస్‌పై కేసు నమోదు చేసినట్లు SI సుధాకర్ పేర్కొన్నారు.