W.G: సమాజంలో బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ డి. శ్రీలక్ష్మి పిలుపునిచ్చారు. శుక్రవారం గునుపూడిలోని అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు సమాచారం తెలిస్తే వెంటనే 1098 నెంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు.