కాకినాడ స్మార్ట్ సిటీ సమావేశ మందిరంలో శుక్రవారం ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ‘ప్రజాదర్బార్’ నిర్వహించారు. నగరంలోని వివిధ డివిజన్ల నుంచి ప్రజలు తరలివచ్చి దోమల నివారణ, వీధిలైట్లు, డ్రైనేజీ, ఇళ్ల స్థలాల మంజూరు వంటి సమస్యలపై వినతులు అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న వెంటనే అర్హులందరికీ కొత్త పెన్షన్లు అందజేస్తామని హామీ ఇచ్చారు.