VZM: 19న ఫైర్ చెస్ స్కూల్ ఆద్వర్యంలో జిల్లా స్థాయి ఓపెన్ చెస్ పోటీలను నిర్వహించనున్నట్లు జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు కేకే. జగన్నాథం శుక్రవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. పోటీల్లో విజేతలుకు రూ.10,300 బహుమతి అందజేస్తామన్నారు. పోటీల్లో పాల్గొనే వారికి వయోపరిమితి లేదని చెప్పారు. మరిన్ని వివరాలకు తమ కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు.