మహబూబ్ నగర్ పాత బస్టాండ్ సమీపంలో జిల్లా పోలీస్ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని జిల్లా ఎస్పీ డి.జానకి ప్రారంభించారు. పదవీ విరమణ చేసినా సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని, ఇది యువ అధికారులకు స్ఫూర్తిదాయకమని ఆమె కొనియాడారు.