SRPT: తిరుమలగిరి మండలం తొండ గ్రామంలో రోడ్డు భద్రతపై వినూత్న అవగాహన కార్యక్రమం చేపట్టింది. ‘నో హెల్మెట్.. నో ఎంట్రీ’ నినాదంతో గ్రామంలోకి వచ్చే ప్రతి ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని పాలకవర్గం గ్రామంలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా ప్రయాణికుల ప్రాణ రక్షణే ధ్యేయంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సర్పంచ్ తెలిపారు.