దక్షిణాది సినీ పరిశ్రమలో పెను మార్పు చోటుచేసుకుంది. టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండల్‌వుడ్ అనే తేడా లేకుండా.. దక్షిణాదిలోని 4 సినీ పరిశ్రమలకు చెందిన అగ్ర నిర్మాతలందరూ ఇప్పుడు ఒకే తాటిపైకి వచ్చారు. సినీ పరిశ్రమను వేధిస్తున్న సమస్యలను పరిష్కరించడమే కాకుండా, నిర్మాతల ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యంగా ‘సౌత్ ఇండియన్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్'(SIFPA) ఆవిర్భవించింది.