NLG: అనుముల ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని పెద్దవూర మండలం చలకుర్తి సెక్టార్ ఊరబావి తండా అంగన్వాడీ కేంద్రంలో, శనివారం పోషణ పక్వాడ కార్యక్రమాన్ని సీడీపీఓ విజయలక్ష్మి సిబ్బందితో ఘనంగా నిర్వహించారు. అంగన్వాడీ టీచర్లు చిరుదాన్యాలతో తయారు చేసిన వివిధ వంటకాలు, పదార్దాలను తయారు చేసుకోని వచ్చారు.