నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల ప్రజలకు ఆదివారం పలు సూచనలు చేశారు. స్వీయ జనగణలో భాగంగా తన కుటుంబ వివరాలను ఆన్లైన్ నమోదు చేశారు. se.census.gov.in వెబ్సైట్లో 33 ప్రశ్నలకు ప్రజలంతా సమాధానం ఇవ్వాలని ఆయన సూచించారు. ఈ నెల 30వ తేదీ వరకు అవకాశం ఉంటుందని తెలియజేశారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.