NLG: మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం బీటెక్ సెమిస్టర్ 2, 4 (రెగ్యులర్ & బ్యాక్ లాగ్), సెమిస్టర్ 1, 3 (బ్యాక్ లాగ్) పరీక్షలను మే 5 నుంచి మే 21 వరకు నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ అధికారులు ప్రకటించారు. ఈ పరీక్షలకు సంబంధించిన పూర్తి టైమ్ టేబుల్స్ ఎంజీయూ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని, విద్యార్థులు వాటిని చూసుకుని పరీక్షలకు సన్నద్ధం కావాలని సూచించారు.